By: Oneindia Telugu Video Team
Published : February 12, 2018, 05:23

పవన్‌, ఉండవల్లి, జెపి కలయిక పై కత్తి మహేష్ సంచలనం

Subscribe to Oneindia Telugu


జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌తో భేటీ అయిన మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ సోమమవారం లోకసత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణతో భేటీ అయ్యారు. పవన్ కల్యాణ్ చొరవతోనే ఉండవల్లి అరుణ్ కుమార్ జెపితో సమావేశమైనట్లు తెలుస్తోంది. విభజన హామీల అమలు కోసం పోరాటం చేసేందుకు కార్యాచరణను రూపొందించే క్రమంలో ఈ భేటీ జరిగింది.
విభజన హామీల సాధనకు జెఎసిని ఏర్పాటు చేస్తానని ప్రకటించిన పవన్ కల్యాణ్ ఆ తర్వా సంయుక్త నిజ నిర్ధారణ కమిటీ (జిఎఫ్‌సి)ని తెర మీదికి తెచ్చారు. దానిపై ఇప్పటికే జయప్రకాశ్ నారాయణ, ఉండవల్లి అరుణ్ కుమార్‌లతో పవన్ కల్యాణ్ చర్చలు జరపారు. పవన్ కల్యాణ్ సూచన మేరకు ఉండవల్లి అరుణ్ కుమార్ సోమవారం జెపితో భేటీ అయ్యారు.
ఎపీ హక్కుల సాధన కోసం పార్టీలకు అతీతంగా అందరితో కలిసి పనిచేస్తామని జెపి ఉండవల్లితో భేటీ అనంతరం చెప్పారు. జెఎఫ్‌సీతో పాటు జెఎసి ఏర్పాటుకు కూడా వారిద్దరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా పాల్గొనడం విశేషం. ఈ నెల 18వ తేదీన విజయవాడలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తన్నట్లు ఆయన తెలిపారు.
ప్రజలకు పనికి వచ్చే రీతిలో అమలు కావాలని మనం కోరుతున్నామని జెపి మీడియాతో అన్నారు. దేశంలో గానీ రాష్ట్రంలో గానీ తాత్కాలికమైన ఆర్భాటాలు, ప్రకటనలు, హడావిడులపై శ్రద్ధ ఎక్కువగా ఉందని, వచ్చే ఫలితంపై శ్రద్ధ లేదని ఆయన అన్నారు.
మనం చేసే పని వల్ల ప్రజలకు ఏ మేరకు ఫలితం వస్తుంది, యువత ఉపాధి కోసం ఏ మేరకు అవకాశాలు పెరుగుతాయి, రాష్ట్రాల అభివృద్ధి కోసం ఏ మేరకు నిధులు అందుతాయనే విషయాలపై హడావిడి లేకుండా ఆలోచన చేస్తామని జెపి చెప్పారు. ఇప్పటికే నాలుగేళ్లు ఆలస్యమైందని, చిక్కుముడులు ఎక్కువయ్యాయని జెపి అన్నారు. తమకు చిత్తశుద్ది తప్ప బలం లేదని జయప్రకాశ్ నారాయణ అన్నారు.
ఇక మరోపక్క జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌పై రాజకీయ విశ్లేషకులు కత్తి మహేష్ మరోసారి ధ్వజమెత్తారు. టైమ్ పాస్ రాజకీయాలు మానుకోవాలని పవన్ కళ్యాణ్‌కు కత్తి మహేష్ సూచించారు. ఏపీకి ఇచ్చిన హమీలను అమలు చేయాలని ఢిల్లీలో ఆంధోళనకు సిద్దమైతే మేమంతా మీ వెంట ఉంటామని కత్తి మహేష్ పవన్‌కళ్యాణ్‌కు తేల్చి చెప్పారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా