By: Oneindia Telugu Video Team
Published : December 28, 2017, 11:20

Paytm : 100 మిలియ‌న్ల డౌన్‌లోడ్లు : ఏకైక పేమెంట్ యాప్‌!

Subscribe to Oneindia Telugu

రీఛార్జ్ యాప్‌గా అడుగుపెట్టి షాపింగ్ స్టోర్‌, పేమెంట్‌ బ్యాంక్‌గా ఎదిగిన పేటీఎం ఇప్పుడు స‌రికొత్త రికార్డును సృష్టించింది. గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియ‌న్ల డౌన్‌లోడ్లు దాటిన ఏకైక పేమెంట్ యాప్‌గా నిలిచింది. ఈ విష‌యాన్ని ప్ర‌క‌టిస్తూ పేటీఎం ఒక అధికారిక ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. డిసెంబ‌ర్ రెండో వారంలో తాము ఈ ఘ‌న‌త సాధించిన‌ట్లు ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ఈ సంద‌ర్భంగా సంస్థ సీనియ‌ర్ వైస్ ప్రెసిడెంట్ దీప‌క్ అబోట్ పేటీఎం ఉద్యోగుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

ఉద్యోగుల కృషి వల్లనే పేటీఎం ఈరోజు ఈ ఘ‌న‌త సాధించగ‌లిగిందని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఈ రికార్డును ఆద‌ర్శంగా తీసుకుని మున్ముందు వినియోగదారులకు మంచి సేవ‌ల‌ను అందిస్తామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఇటీవ‌ల నియ‌ర్‌బై.కామ్‌, లిటిల్ ఇంట‌ర్నెట్ సంస్థ‌లను పేటీఎం చేజిక్కించుకున్న సంగ‌తి తెలిసిందే. నిత్య జీవితంలో చెల్లింపులు అవసరమైన చాలాచోట్ల పేటీఎం ద్వారా చెల్లింపులకు అవకాశం ఉండడంతో ప్రజలకు కూడా ఈ యాప్ పట్ల అమిత ఆదరణ కనబరుస్తున్నారు.


Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా