By: Oneindia Telugu Video Team
Published : November 17, 2017, 10:44

లీటర్ పెట్రోల్ @ రూ.300

Subscribe to Oneindia Telugu


పెట్రోల్ ధరలు ఇండియాలో రూ. 300 చేరుకొనే అవకాశాలు లేకపోలేదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా చోటు చేసుకొంటున్న మార్పులు పెట్రోల్ ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఇండియాలో పెట్రోల్, డీజీల్ ధరలు ఇతర దేశాలతో పోలిస్తే ఎక్కువగా ఉన్నాయి. ఈ తరుణంలో అంతర్జాతీయంగా చోటు చేసుకొంటున్న మార్పులు ఇండియాలో మరింత ధరలు పెరిగే అవకాశం ఉందనే వార్త వినియోగదారుల గుండెల్లో గుబులు రేపుతోంది. లీటర్ పెట్రోల్ ధరలు కనీసం రూ. 70 దాటితేనే ఇతర దేశాలతో పోలిస్గే ఇండియాలో ఈ ధరలు ఎక్కువనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.
మధ్యప్రాచ్యంలో మొదలైన ప్రచ్ఛన్న యుద్దం సమీప రోజుల్లో భారత్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావాలను చూపేలాకన్పిస్తున్నాయి. ఈ పరిణామాలతో ఇండియాలో ఇంధన ధరలకు రెక్కలు వచ్చేలా కనిపిస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో అత్యంత బలమైన ఇరాన్‌, సౌదీ అరేబియాలు.. ముడి చమురు ధరను భారీగా పెంచేలా కనిపిస్తున్నాయి. ఇంధన ధరలు పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా