By : Oneindia Telugu Video Team
Published : February 22, 2018, 04:10

పీఎన్బీ స్కాం: ఖరీదైన కార్లు సీజ్

పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)లో 11వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన నగల వ్యాపారవేత్త నీరవ్ మోడీ కేసులో సీబీఐ, ఈడీ దూకుడు చూపుతున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా నీరవ్ మోడీ ఆస్తులను సీజ్ చేస్తున్న ఈడీ.. తాజాగా మరిన్ని ఆస్తులను సీజ్ చేసింది.
పీఎన్బీ స్కాంలో ప్రధాన నిందితులైన నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ గ్రూప్స్‌కు సంబంధించిన రూ.94కోట్ల విలువైన షేర్లు, మ్యూచువల్ ఫండ్స్‌ను గురువారం ఎన్‌ఫోర్స్ డైరెక్టరేట్(ఈడీ) సీజ్ చేసింది.
వీటితోపాటు నీరవ్ మోడీకి చెందిన 9 విలాసవంతమైన కార్లను కూడా స్వాధీనం చేసుకుంది. వీటిలో ఒక రోల్స్ రాయిస్ ఘోస్ట్, రెండు మెర్సిడెస్ బెంజ్ మోడీల్స్ జీఎల్ 350సీడీఐ, పోర్షే పనామెరా, మూడు హోండా కార్లు, ఒక టాయోటా ఫార్చూనర్, టాయోటా ఇన్నోవాలు ఉన్నాయి.
నీరవ్ మోడీకి చెందిన రూ. 7.80కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్స్, షేర్లు, మెహుల్ చోక్సీ గ్రూప్‌కి సంబంధించిన రూ.86.67కోట్ల మ్యూచువల్ ఫండ్స్, షేర్లు ఈడీ స్వాధీనం చేసుకుంది.
కాగా, బుధవారం ముంబైలోని నాలుగు షెల్ కంపెనీలతోపాటు దేశంలోని 17 ప్రాంతాల్లో ఈడీ ముమ్మర దాడులు నిర్వహించింది. బుధవారం రూ.10కోట్ల వరకు ఈడీ స్వాధీనం చేసుకుంది. ఇక పన్నుల శాఖ కూడా నీరవ్ మోడీకి చెందిన 141 బ్యాంకు ఖాతాల్లోని రూ.145.74కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లను అటాచ్ చేసింది

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా