By: Oneindia Telugu Video Team
Published : October 27, 2017, 12:03

చలో అసెంబ్లీకి అడ్డుకట్ట

Subscribe to Oneindia Telugu

తెలంగాణ ప్రభుత్వం ప్రజావ్యతిరేక కార్యక్రమాలు చేపడుతుందని ఆరోపిస్తూ శుక్రవారం కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన చలో అసెంబ్లీని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. గాంధీభవన్ వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. అక్కడికి చేరుకుంటున్న కాంగ్రెస్ నేతలను అరెస్టు చేస్తున్నారు. చలో అసెంబ్లీ నేపథ్యంలో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్‌కు చెందిన పాతబస్తీలోని ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అంజన్ కుమారుడు అరవింద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేటి నుంచే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న కారణంగా అక్కడ భారీగా పోలీసులు మోహరించారు.
వివిధ జిల్లాల నుంచి వచ్చే కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. అరెస్టుల పట్ల కాంగ్రెస్ నేతల నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే.. టీడీపీ-బీజేపీ నేతలు పాదయాత్రగా అసెంబ్లీకి చేరుకునేందుకు సిద్ధమయ్యారు.
ప్రతిపక్షాల గొంతునొక్కడం సరికాదని మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు. రుణమాఫీ ఇప్పటికీ పూర్తిగా అమలు కావడం లేదు. సీఎం కేసీఆర్ మాటల గారడితో కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. నియంతలు పిరికిపందలు అవుతారని అన్నారు. సీఎం కేసీఆర్ నియంతగా వ్యవహరిస్తున్నారని అన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా