By : Oneindia Telugu Video Team
Published : January 06, 2017, 07:21

కరీంనగర్ జిల్లాలో కార్డాన్ సెర్చ్

కరీంనగర్‌ హుస్సేన్‌ పురాలో పోలీసులు ఉదయం కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఉదయం 5.30 గంటల నుంచి ప్రారంభమైన ఈ కార్డన్ సెర్చ్ 10 గంటల సమయం వరకు కొనసాగింది. కరీంనగర్ పోలీస్ కమీషనర్ కమలాసన్ రెడ్డి ఆధ్యర్యంలో 400ల మంది పోలీసులతో ఖర్ఖానాగడ్డ నుండి హుస్సేన్ పుర, ఖన్ పుర ప్రాంతాల్లో తనీఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఇళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఎవరూ తప్పించుకుపోకుండా ఆ ప్రాంతంలోని ప్రధాన మార్గాలన్నీ మూసివేసి నిర్భంధ తనిఖీలను చేపట్టారు. తనిఖీలు చేసి సరైన పత్రాలు లేని 35 ద్విచక్రవాహనాలను, 5 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా