By: Oneindia Telugu Video Team
Published : November 23, 2017, 06:13

అభిమానితో సెల్ఫీ: చిక్కుల్లో పడ్డ హీరో !

Subscribe to Oneindia Telugu


రోడ్డుపై వెళ్తున్నప్పుడు సడెన్‌గా సెలబ్రిటీ ఎవరైనా కనిపించారనుకోండి.. అభిమానులు వారి వెంటపడి సెల్ఫీలు కోరడం ఈరోజుల్లో అత్యంత సహజం. అయితే తాము ఎక్కడ, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో చూసుకుని మెలగాల్సిన బాధ్యత సెలబ్రిటీలపై ఉంటుంది. దాన్ని విస్మరిస్తే ఆ తర్వాత చెడ్డ పేరు వచ్చేది వారికే.
తాజాగా ముంబై రోడ్డుపై ఓ అభిమానితో సెల్ఫీ దిగిన బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ చిక్కుల్లో పడ్డాడు. అతని తీరుపై ముంబై పోలీస్ యంత్రాంగం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అటు వరుణ్ కూడా పోలీసుల ధర్మాగ్రహం పట్ల సానుకూలంగానే స్పందించి క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఇంతకీ అసలు విషయమేంటంటే.. ఇటీవల వరుణ్ ధావన్ తన కారులో వెళ్తున్న సమయంలో ట్రాఫిక్ లో చిక్కుకున్నాడు. అతని కారు పక్కనే మరో ఆటో వచ్చి ఆగింది. ఆటోలో ఉన్న యువతి వరుణ్ ను గుర్తుపట్టి.. 'నేను మీకు పెద్ద ఫ్యాన్.. ప్లీజ్ ఒక్క సెల్ఫీ' అంటూ రిక్వెస్ట్ చేసింది. అభిమాని కోరిక కాదనలేక.. కారులోంచే తల బయటకు పెట్టి మరీ ఆమెతో సెల్ఫీ దిగాడు వరుణ్.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా