By : Oneindia Telugu Video Team
Published : March 29, 2018, 05:02

కెసిఆర్‌తో సినీ నటుడు ప్రకాష్‌రాజ్ భేటీ

సినీ నటుడు ప్రకాష్‌రాజ్ తెలంగాణ సీఎం కెసిఆర్‌తో కలిసి తెలంగాణ అసెంబ్లీకి గురువారం నాడు వచ్చారు. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులతో పాటు తెలంగాణలో ప్రకాష్ రాజ్ దత్తత తీసుకొన్న గ్రామం గురించి చర్చించే అవకాశం ఉందని సమాచారం. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కొండారెడ్డిపల్లి గ్రామాన్ని విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ దత్తత తీసుకొన్నారు. ఈ గ్రామ ప్రజలకు సౌకర్యాలను కల్పిస్తున్నారు.
అంతకుముందు మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో సీఎం కెసిఆర్‌ను కలిశారు.అక్కడి నుండి నేరుగా ముఖ్యమంత్రితో కలిసి ప్రకాష్‌రాజ్ అసెంబ్లీకి వచ్చారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని కెసిఆర్ భావిస్తున్నారు. ఈ తరుణంలో ప్రకాష్ రాజ్ తో భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది. బిజెపికి వ్యతిరేకంగా ప్రకాష్ రాజ్ ఇటీవల కాలంలో గళమెత్తారు. గౌరీ లంకేష్ హత్య తర్వాత బిజెపి నేతలపై, ప్రధానమంత్రి మోడీపై ప్రకాష్‌రాజ్ విమర్శలు పెద్ద ఎత్తున చేశారు. అయితే ఈ తరుణంలో ప్రకాష్ రాజ్ , తెలంగాణ సీఎం కెసిఆర్‌తో సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది. సినీ నటుడు ప్రకాష్‌రాజ్‌ను కూడ ఫెడరల్ ఫ్రంట్‌లో భాగస్వామ్యం చేసే దిశగా కెసిఆర్ ఆలోచన చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా