• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : January 16, 2018, 06:48
    Duration : 01:13

    ఎన్‌కౌంటర్‌, పోలీసుల వేధింపులు.. ప్రవీణ్ తొగాడియా సంచలనం

    రాజస్థాన్ పోలీసులు తనను ఎన్‌కౌంటర్ చేసే ప్రమాదం ఉందని విహెచ్‌పి అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్‌ తొగాడియా ఆరోపించారు. ఈ విషయమై తనకు సమాచారం ఉన్నందునే పోలీసుల నుండి తప్పించుకొన్నానని ఆయన చెప్పారు.
    మంగళవారం నాడు ప్రవీణ్‌తొగాడియా మీడియాతో మాట్లాడారు. ఓ కేసులో రాజస్థాన్ పోలీసులు తనను అరెస్ట్ చేసేందుకు వస్తున్నారని సమాచారం వచ్చిందన్నారు. అయితే ఆ కేసులో పోలీసులు తనను ఎన్‌కౌంటర్ చేసే ప్రమాదం ఉందని సమాచారం ఉండడంతో తాను పోలీసుల నుండి తప్పించుకొన్నట్టు ఆయన చెప్పారు.
    తనపై తప్పుడు కేసులు పెట్టారని ప్రవీణ్‌ తొగాడియా ఆరోపించారు. పదేళ్ల నాటి కేసులో తనను వేధింపులకు గురిచేస్తున్నారని తొగాడియా ఆరోపణలు చేశారు. గుజరాత్, రాజస్థాన్ పోలీసులు తనను వెంటాడుతున్నారని తొగాడియా చెప్పారు. తనను అంతమొందించేందుకు కుట్ర పన్నుతున్నారని తొగాడియా ఆరోపణలు చేశారు. ఈ కారణంగానే తాను మొబైల్ స్విచ్చాఫ్ చేసినట్టు ప్రవీణ్ తొగాడియా ప్రకటించారు. తాను కోలుకొన్నాక పోలీసులకు లొంగిపోనున్నట్టు తొగాడియా ప్రకటించారు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా