By: Oneindia Telugu Video Team
Published : July 17, 2017, 06:35

రాష్ట్రపతి ఎన్నికల్లో సచిన్, రేఖ ఓటు వెయ్యలేదు... ఎందుకంటే

Subscribe to Oneindia Telugu

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక జ‌రుగుతున్న వేళ ఇప్పుడు దేశమంతా ఆ అంశంపైనే చర్చించుకుంటోంది. పార్ల‌మెంట్‌తోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకుంటున్నారు. లోక్‌స‌భ, రాజ్య‌స‌భ‌లోని ఎంపీలు పార్లమెంట్‌లో ఓటేస్తున్నారు.కానీ, రాజ్య‌స‌భ సభ్యులే అయిన మాజీ క్రికెట్ దిగ్గజం స‌చిన్ టెండూల్క‌ర్‌, బాలీవుడ్ న‌టి రేఖ‌, బీజేపీ సీనియ‌ర్ నేత సుబ్ర‌మ‌ణ్య‌స్వామి, బాక్స‌ర్ మేరీకోమ్‌లు మాత్రం ఓటు వేయ‌డం లేదు. ఎందుకంటే వీరికి ఓటు వేసే హక్కు లేదు. ఎందుకంటే.. వీళ్లంతా రాష్ట్ర‌ప‌తి నామినేటెడ్ ఎంపీలు.రాష్ట్ర‌ప‌తే వీళ్ల‌ను నామినేట్ చేశారు కాబట్టి ఆ ప‌ద‌వికి జ‌రిగే ఎన్నిక‌లో ఓటు వేయ‌డానికి వీళ్లు అర్హులు కాదు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా