By: Oneindia Telugu Video Team
Published : February 15, 2018, 12:30

హైదరాబాదులో ఫిర్యాదుపై 'ప్రియా ప్రకాశ్ వారియర్'

Subscribe to Oneindia Telugu

ఒరు అదర్ లవ్ సినిమాలో నటి ప్రియా ప్రకాశ్ వారియర్ హావభావాలు అందరినీ కట్టిపడేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ పాట దుమ్ము రేపుతోంది. అయితే ఈ పాట తమ మనోభావాలు దెబ్బతీస్తోందంటూ కొందరు ముస్లీం యువకులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
హైదరాబాదులోని ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్‌లో మహమ్మద్ ముఖీత్ అనే ఇరవై ఏళ్ల విద్యార్థి కొందరు స్నేహితులతో కలిసి ఈ ఫిర్యాదు చేశారు.
మలయాళ చిత్రం ఒరు అదర్ లవ్‌లో ముస్లీంలను కించపరిచేలా లిరిక్స్ ఉన్నాయని వారు పేర్కొన్నారు. ఓ వర్గాన్ని కించపరచడం లేదా మనోభావాలను దెబ్బతీయడం కింద సెక్షన్ 295ఏ ప్రకారం కేసు నమోదు చేసే అవకాశముంది. అయితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.
ఈ చిత్రంలో తమ వర్గాన్ని కించపరిచేలా ఉందంటూ దర్శకుడిపై వారు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దానిని పరిశీలన కోసం ఉన్నతాధికారులకు పంపించారు. నటి ప్రియ యాక్షన్ విషయంలో తమకు అభ్యంతరం లేదని తెలిపారు.
హైదరాబాదులో తన సినిమా విషయంలో ఫిర్యాదుపై నటి ప్రియా ప్రకాశ్ వారియర్ కూడా స్పందించారని తెలుస్తోంది. ఊహించని పాపులారిటీకి ఎలా స్పందించాలో తనకు అర్థం కావడం లేదని, కన్ను గీటే సీన్‌ను రిహార్సల్స్ చేయకుండానే చేశానని చెప్పారు. ఫిర్యాదుల గురించి తనకు తెలియదని, దీనిపై మౌనంగా ఉండటమే మంచిది అనిపిస్తోందన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా