By: Oneindia Telugu Video Team
Published : August 02, 2017, 12:51

తెలుగు టైటాన్స్‌కు హ్యాట్రిక్ ఓటమి

Subscribe to Oneindia Telugu

సొంతగడ్డపై తెలుగు టైటాన్స్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. వరుసగా మూడో మ్యాచ్‌లో ఓటమి పాలైంది. గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియం వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో కొత్త జట్టు యూపి యోధా చేతిలో
31-18 తేడాతో తెలుగు టైటాన్స్ చిత్తుగా ఓడింది. తొలుత పోటాపోటీగా ఆడి తొలి అర్ధ భాగాన్ని 11-12తో ముగించిన టైటాన్స్‌ ద్వితీయార్ధంలో తేలిపోయింది. కెప్టెన్‌ రాహుల్‌ చౌదరి (7 పాయింట్లు) ఫర్వాలేదనిపించినా.. కీలక సమయాల్లో మాత్రం విఫలయ్యాడు. డిఫెన్స్‌లో సమన్వయలోపం, రైడింగ్‌లో రాహుల్‌చౌదరిపై ఆధారపడటం టైటాన్స్‌ ఓటమికి కారణమైంది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా