By : Oneindia Telugu Video Team
Published : April 20, 2017, 08:30

పంజాబ్ రాత మారుతుందా? హ్యాట్రిక్‌ కోసం ముంబై

ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా గురువారం ఇండోర్‌లో పంజాబ్ తో ముంబై తలపడనుంది. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు తలపడిన 18 మ్యాచ్‌ల్లో ఇరు జట్లు చెరో తొమ్మిది మ్యాచ్‌లు గెలిచి సమంగా ఉన్నాయి. ఇక ఈ సీజన్‌ని విజయంతో ఆరంభించిన పంజాబ్ ఆ తర్వాత ఆశించిన స్ధాయిలో రాణించలేకపోతోంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైన ముంబై ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుని వరుస విజయాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండగా, పంజాబ్ మాత్రం ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇండోర్‌లోని హోల్కర్‌ స్టేడియంలో ఇరు జట్ల మధ్య పోరు రసవత్తరంగా మారింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా