By : Oneindia Telugu Video Team
Published : April 28, 2017, 07:01

బాబుకి మళ్ళీ షాకిచ్చిన పురంధేశ్వరి

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు భారతీయ జనతా పార్టీ నేత, మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి మరోసారి షాకిచ్చారు. ఏపీ అభివృద్ధిలో సింహభాగం కేంద్రానిదేనని ఆమె స్పష్టం చేశారు. రాజధాని, పోలవరం నిర్మాణం, పలు అభివృద్ధి పనులకు కేంద్రం పెద్ద మొత్తంలో సాయం చేస్తోందని వివరించారు.
శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోడీ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించి బీసీలకు న్యాయం చేశారన్నారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రధాని పనిచేస్తున్నారని, సంక్షేమ కార్యక్రమాలలోనూ వారికే పెద్దపీట వేస్తున్నారని పురందేశ్వరి అన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా