By: Oneindia Telugu Video Team
Published : January 06, 2018, 12:13

నవ్యాంధ్రకు నేనున్నా

Subscribe to Oneindia Telugu

'అయామ్ ఫర్ ఆంధ్రా.. డోంట్ వర్రీ'.. విభజన సమస్యలపై తనను కలిసిన టీడీపీ ఎంపీలకు ప్రధాని మోడీ ఇచ్చిన భరోసా ఇది. శుక్రవారం ప్రధానిని కలిసిన టీడీపీ ఎంపీలు రాష్ట్రంలోని సమస్యలు, విభజన హామీల్లో ఇప్పటి వరకు ఒక్కటి కూడా అమలుకాని వైనాన్ని వివరించి, ఒక వినతి పత్రాన్ని కూడా ఆయనకు అందించారు. టీడీపీ ఎంపీల విన్నపానికి స్పందించిన మోడీ.. ఏపీకి తాను అన్ని విధాలుగా అండగా ఉంటానంటూ వారికి భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా తన అపాయింట్‌మెంట్ అడిగారని, రెండు మూడు రోజుల్లో ఆయనతో మాట్లాడతానని చెప్పారు. ఆందోళన వద్దని, ఆంధ్రప్రదేశ్‌కు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తానని స్పష్టం చేశారు.
శుక్రవారం తెలుగుదేశం ఎంపీలు ఢిల్లీలో ప్రధానమంత్రిని కలిశారు. రాష్ట్ర సమస్యలను ఏకరవు పెట్టారు. ‘‘కేంద్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు దాటిపోయింది. ఇప్పటికీ విభజన చట్టం కింద ఇచ్చిన అనేక హామీలు నెరవేరలేదు. దీనివల్ల రాష్ట్రం తీవ్ర కష్టాలు ఎదుర్కొంటోంది'' అని తెలిపారు. మరో ఏడాదిన్నరలోపే ఎన్నికలు వస్తున్నాయని గుర్తు చేశారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా