By : Oneindia Telugu Video Team
Published : April 12, 2018, 04:39

బీజేపీలోకి కుంబ్లే, రాహుల్ ద్రావిడ్

కర్ణాటకలో మే 12వ తేదీ శాసన సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షం బీజేపీతో పాటు జేడీఎస్ పార్టీ నాయకులు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. తాజాగా బీజేపీ నేతలు టీం ఇండియా మాజీ దిగ్గజాలు రాహుల్ ద్రావిడ్, అనీల్ కుంబ్లేకి గాలం వేశారని, వారితో అనేకసార్లు చర్చలు జరిపారని వెలుగు చూసింది.
టీం ఇండియాలో అనీల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్ కు క్లీన్ చిట్ ఉంది.ఎలాంటి వివాదాలకు ఆస్కారం ఇవ్వకుండా అనీల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్ వారి క్రికెట్ కెరీర్ పూర్తి చేశారు. యువతలో అనీల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్ కు మంచి క్రేజ్ ఉంది.
యువ ఓటర్లను ఆకర్షించడానికి అనీల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్ ను బీజేపీ నాయకులు పార్టీలోకి ఆహ్వానించారని సమాచారం. అనీల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్ ఇద్దరూ కర్ణాటకకు చెందిన వారే కావడంతో బీజేపీ నాయకులు వారితో చర్చలు జరిపారని తెలిసింది.
అనీల్ కుంబ్లే సన్నిహితుల తెలిపిన వివరాల ప్రకారం శాసన సభ ఎన్నికలు తేదీ ప్రకటించిన నాటి నుంచి బీజేపీ నాయకులు ఆయన్ను, రాహుల్ ద్రావిడ్ ను అనేకసార్లు కలిసి పార్టీలో చేరాలని ఆహ్వానించారని, అనేకసార్లు చర్చలు జరిగాయని సమాచారం.
కర్ణాటకలోని గ్రామీణ ప్రాంతాల్లో సైతం రాహుల్ ద్రావిడ్, అనీల్ కుంబ్లేకి చాల క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ నాయకులు అనీల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్ ను పార్టీలోకి ఆహ్వానించారని తెలిసింది. రాజకీయాలకు దూరంగా ఉండాలని బీజేపీ ఆహ్వానాన్ని అనీల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్ సున్నితంగా తిరస్కరించారని తెలిసింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా