• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : July 20, 2018, 07:04
    Duration : 02:24

    ఎంపీ గల్లా జయదేవ్ పై రాహుల్ వ్యాఖ్యలు

    అవిశ్వాస తీర్మానంపై లోకసభలో చర్చ సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఓటింగును బహిష్కరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుదీర్ఘ చర్చలో కాంగ్రెస్ పాల్గొని, ఆ తర్వాత ఓటింగు సమయంలో సభ నుంచి వాకౌట్ చేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఇది టీడీపీకి, సీఎం చంద్రబాబుకు ఊహించని షాక్. అవిశ్వాసం చర్చలో పాల్గొని, ఓటింగులో కాంగ్రెస్ పాల్గొనకుంటే బీజేపీకి మరింత ప్లస్ అవుతుంది.
    కాగా, రాహుల్ గాంధీ సుదీర్ఘ ప్రసంగం చేశారు. తన ప్రసంగంలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పేరును ప్రస్తావించారు. రాహుల్ మాట్లాడుతుండగా మోడీ నవ్వారు. ప్రధాని నవ్వుతున్నప్పటికీ ఆయన మనసులో ఆందోళన కనిపిస్తోందన్నారు. ఏపీ ప్రజల ఆవేదన గల్లా ప్రసంగంలో కనిపించిందన్నారు. ఆయన ప్రసంగంలో నవ్యాంధ్ర ప్రజల బాధ తెలిసిందన్నారు. 21వ శతాబ్దం బాధిత రాష్ట్రం ఏపీ అన్నారు. తాను గల్లా ప్రసంగాన్ని జాగ్రత్తగా విన్నానని చెప్పారు. ఇదే విషయాన్ని రాహుల్.. టీడీపీ ఎంపీలను చూసి చెప్పారు. మీరు 21 శతాబ్ధం తొలి (ఏపీ) బాధితులన్నారు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా