• search
By : Oneindia Telugu Video Team
Published : February 09, 2018, 05:04
Duration : 02:20

ఒకవైపు రాహుల్ ట్వీట్ మరోవైపు అమిత్ షా పై సోము వీర్రాజు


బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిన్న బంద్ (గురువారం-08-02-2018) రోజు తమను బయటకు రాకుండా చేసిందని, ఇంత జరుగుతుంటే హోంమంత్రి ఏం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
తన గొంతు నొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కర్నూలు సభలో తాను చంద్రబాబును ఉద్దేశించి ఏమీ అనలేదని తేల్చి చెప్పారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, లోక్‌సత్తా జయప్రకాశ్ నారాయణతో కలిసి జేఏసీ ఏర్పాటు చేస్తే మంచిదేనని చెప్పారు. ఏపీకి తీవ్ర అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీతో టీడీపీ జత కలిస్తే ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయని సోము వీర్రాజు ప్రశ్నించారు.ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధులపై పెద్దలు ఢిల్లీకి వెళ్లి మాట్లాడాలని సోము వీర్రాజు సూచించారు. రాష్ట్రంలో ఆందోళనలకు ఫుల్ స్టాప్ పెట్టవలసి ఉందని చెప్పారు. ప్రభుత్వం తనను బంద్ రోజు బయటకు రాకుండా చేసిందన్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా తనకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారన్న వార్తలపై సోము వీర్రాజు స్పందించారు. అమిత్ షా తనను మందలించలేదన్నారు. తన గొంతు నొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కాగా, సోము వీర్రాజుపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారని వార్తలు వచ్చాయి. మిత్రపక్షం టిడిపి గురించి మాట్లాడే అధికారం నీకు ఎవరు ఇచ్చారని అధిష్టానం నిలదీసిందని, మిత్రధర్మం, వచ్చే ఎన్నికల్లో పొత్తులపై ఎందుకు మాట్లాడుతున్నారని, వ్యక్తిగత అజెండాతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దని, ఇలాగే మళ్లీ మాట్లాడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించినట్లుగా వార్తలు వచ్చాయి.
ఇక మరోపక్క గత నాలుగు రోజులుగా రాజ్యసభలో వెల్లోకి వెళ్లి నిరసన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్ర రావుకు శుక్రవారం మద్దతు లభించింది. ఆయనకు టిడిపి నుంచి అనూహ్య స్పందన లభించింది. కేవీపీతో పాటు టీడీపీ ఎంపీలు సీఎం రమేష్, టీజీ వెంకటేష్ తదితరులు కూడా వెల్లోకి వచ్చి నినాదాలు చేశారు. నలుగురు సభ్యులు వెల్లోకి రావడంతో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
ఇదిలా ఉండకా, ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, విభజన హామీను నెరవేర్చాలని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఏపీ టీడీపీ ఎంపీలకు మద్దతుగా ఆయన ట్వీట్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలన్న ఎంపీల డిమాండుకు కాంగ్రెస్ మద్దతిస్తోందని రాహుల్ పేర్కొన్నారు. ఏపీ విభజన హామీలపై అన్ని పార్టీలు ఏకం కావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. న్యాయం చేయాలన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more