By: Oneindia Telugu Video Team
Published : December 16, 2017, 12:37

రాహుల్ పట్టాభిషేకం

Subscribe to Oneindia Telugu

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ శనివారం బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్దకు భారీగా నేతలు, కార్యకర్తలు చేరుకోవడంతో సందడి నెలకొంది.
కార్యాలయానికి వెళ్లే దారి వెంట.. పార్టీ ఆఫీస్‌ బయట రాహుల్‌ గాంధీ పోస్టర్లు, హోర్డింగ్‌లు వెలిశాయి. శుక్రవారం నుంచే యువ, వివిధ విభాగాల ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యాక్రమాలతో సందడి నెలకొంది.
ఇక రాహుల్‌ గాంధీ ప్రమాణస్వీకార నేపథ్యంలో పలువురు నేతలు ఢిల్లీకి క్యూ కట్టడంతో కోలాహలం నెలకొంది. 2014 ఎన్నికల తర్వాత కుదేలైన పార్టీని తిరిగి పుంజుకునేలా చేస్తాడని సీనియర్లతోసహా అంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఉదయమే పార్టీ కార్యాలయానికి చేరుకున్న కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలెట్‌ మీడియాతో మాట్లాడారు.
రాహుల్‌ ఏకగ్రీవ ఎంపిక.. లక్షలాది మంది కార్యకర్తల కోరిక. 2019లో బీజేపీకి పోటీ పార్టీ కాంగ్రెస్ మాత్రమే. రాహుల్‌ గాంధీ నేతృత్వంలో మరింత శక్తితో ముందుకు సాగుతుంది' అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలో ఢిల్లీలోనేగాక, దేశ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా