రైల్లో ఎలుకలు తిరిగాయి...రూ.19వేలు చెల్లించండి

Published : July 19, 2018 06:41 PM (IST)
Railways paid Rs.19,000/- as Compensation
రైలు కంపార్ట్ మెంట్లలో ఎలుకలు తిరుగుతున్నాయని, బోగీలు శుభ్రంగా లేవని వినియోగదారుల కోర్టులో ఓ మహిళా న్యాయవాది పిటిషన్ వేయడంతో ఆమెకు రూ. 19వేలు రైల్వే శాఖ చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది కోర్టు. ప్రయాణికుల వద్ద ఛార్జీల రూపంలో డబ్బులు వసూలు చేసి... శుభ్రతను పాటించని రైల్వేశాఖపై కోర్టు మండిపడుతూ ప్రయాణికులకు జరిమానా కట్టాల్సిందేనంటూ ఆదేశించింది.శీతల్ కనకియా అనే మహిళా న్యాయవాది ఆమె బంధువు హేమ కనకియాలు 2015 నవంబర్ 7న లోక్‌మాన్య తిలక్ టెర్మినల్ నుంచి దురంతోలో ప్రయాణించారు. అయితే ప్రయాణ సమయంలో బోగీలో ఎలుకలు తిరుగుతున్నట్లు గుర్తించారు. అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోలేదు. అంత పెద్ద రైలును శుభ్రం చేసేందుకు తమకు మూడుగంటల సమయం మాత్రమే ఉంటుందన్న నిర్లక్షపు సమాధానం ఇచ్చారు. దీంతో శీతల్ తన ప్రయాణం ముగిశాక, డిసెంబర్ 2, 2015లో కన్స్యూమర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తాము ప్రయాణించిన దురంతో ఎక్స్‌ప్రెస్‌ బోగీలు పరిశుభ్రంగా లేవని... రైలులో అమ్మిన ఆహారం కూడా శుభ్రంగా లేదని దీంతో వారు ప్రయాణం మొత్తం అనారోగ్యంతోనే బాధపడినట్లు పేర్కొంది. టాయ్‌లెట్స్ కూడా క్లీన్‌గా లేవంటూ ఫిర్యాదు చేయడమే కాదు.. తామంతా నరకాన్ని అనుభవించినట్లు పిటిషన్‌లో తెలిపింది.
Up Next
Recommended వీడియోలు
  • 1 hour ago
    ఓటు వేసిన రజినీ
  • 13 hours ago
    ముంబై ఇండియన్స్ లక్ మామూలుగా లేదు..
  • 16 hours ago
    చెలరేగిన సూర్య కుమార్ యాదవ్.. తెలుగోడి సత్తా ఇది..
  • 17 hours ago
    అమృత్ భారత్ రైళ్ల ప్రత్యేకతలు..
  • 17 hours ago
    ఈ ఐపీఎల్ ఆటగాళ్ళ సత్తకు పరీక్ష..
  • 19 hours ago
    వాతావరణ శాఖ బిగ్ అలెర్ట్.. శని, ఆదివారాల్లో మీరు జాగ్రత్త..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా