దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
  • search
By : Oneindia Telugu Video Team
Published : May 26, 2018, 11:11
Duration : 01:30

కోటి రూపాయలకో వికెట్ తీసిన జయదేవ్ ఉనాద్కత్

ఐపీఎల్ 2018 సీజన్ కోసం బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ జయదేవ్ ఉనాద్కత్‌ను రూ.11.5 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో వేలంలో అత్యంత ఖరీదైన భారత ఆటగాడిగా జయదేవ్ ఉనాద్కత్ రికార్డులకెక్కిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత ఐపీఎల్ ప్రారంభమైంది. తనపై రాజస్థాన్ యాజమాన్యం పెట్టుకున్న ఎన్నో అంచనాలను నిలబెట్టడంలో ఉనాద్కత్ పూర్తిగా విఫలమయ్యాడు. ఈ సీజన్‌లో పేలవ ప్రదర్శనతో వికెట్లు రాబట్టడంలో పూర్తిగా విఫలమయ్యాడు. తద్వారా ఎలిమినేటర్ మ్యాచ్‌లో జట్టుని గెలిపించలేకపోయాడు.
ఈ సీజన్‌లో మొత్తం 15 మ్యాచ్‌లు ఆడిన ఉనాద్కత్ 11 వికెట్లు మాత్రమే తీశాడు. దీనిని బట్టి చూస్తే రాజస్థాన్ యాజమాన్యం తనపై పెట్టిన రూ.11.5 కోట్లకు గాను రూ.కోటికి ఓ వికెట్ చొప్పున తీశాడన్నమాట. అంతేకాదు జయదేవ్ ఉనాద్కత్ 44.18 బౌలింగ్ సగటు మాత్రమే నమోదు చేశాడు.
ఈ సీజన్‌లో జయదేవ్ ఉనాద్కత్ 16.50 ఎకానమీ రేటుతో చెత్త గణాంకాలు నమోదు చేశాడు. కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లోనూ జట్టుకు అండగా నిలవడంలో విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో రెండు ఓవర్లు వేసిన ఉనాద్కత్ 33 పరుగులు సమర్పించుకుని తీవ్రంగా నిరాశపరిచాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి