By: Oneindia Telugu Video Team
Published : January 03, 2018, 05:23

కరుణానిధిని కలవనున్న రజనీకాంత్..

Subscribe to Oneindia Telugu

తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు సంచలన ప్రకటన చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్ బుధవారం డీఎంకే కురువృద్ధుడు కరుణానిధిని కలవనున్నారు. వీరిద్దరి మధ్య భేటీ అనేది తమిళనాట ఆసక్తికర చర్చ సాగుతోంది. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు రజనీ మూడు రోజుల క్రితం అంటే డిసెంబర్ 31న ప్రకటన చేశారు.
రజనీకాంత్.. కరుణానిధిని కలుస్తారని, కలైంగర్ (కరుణ) నివాసంలో బుధవారం సాయంత్రం సూపర్ స్టార్ కలవనున్నారని చెబుతున్నారు. ఈ భేటీలో డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్, ఇతర కుటుంబ సభ్యులు, డీఎంకే నేతలు పాల్గొంటారని చెప్పారు.
రజనీకాంత్ - కరుణానిధి మధ్య 1980ల నుంచి స్నేహం కొనసాగుతోంది. 1996లో ఇది మరింత బలపడింది. నాటి అసెంబ్లీ ఎన్నికల్లో రజనీకాంత్ డీఎంకేకు మద్దతు ప్రకటించారు. జయలలితకు ఓటు వేస్తే తమిళనాడును ఎవరూ రక్షించలేరని రజనీకాంత్ అప్పుడు చెప్పారు. ఆ ఎన్నికల్లో డీఎంకే అద్భుత విజయం సాధించింది.
1996లో రజనీకాంత్ మద్దతు కారణంగా డీఎంకే గెలిచి, కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి వారి మధ్య స్నేహం మరింత దృఢమైందని చెబుతారు. అయితే ఆ తర్వాత మరోసారి జయలలితకు రజనీకాంత్ మద్దతు పలకడం గమనార్హం.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా