By: Oneindia Telugu Video Team
Published : December 26, 2017, 12:27

రజినీ రాజకీయ రంగ ప్రవేశం పక్కా..!

Subscribe to Oneindia Telugu

యుద్ధానికి దిగడానికి ముందు సర్వం సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. తన రాజకీయ రంగ ప్రవేశంపై ఈ నెల 31వ తేదీన ప్రటన చేస్తానని ప్రకటించిన ఆయన అభిమానులను ఉద్దేశించి ఉద్వేగంగానే మాట్లాడారు.
తనకు రాజకీయాలు కొత్త కాదని అన్నారు. తన ఇంట్లో జయలలిత కలిసినప్పుడు చాలా మర్యాదగా వ్యవహరించానని చెప్పారు.
తనకు రాజకీయాలు కొత్త కాదంటూనే డైనమిక్స్ తెలుసు కాబట్టి రాజకీయాల్లోకి రావడానికి కొంత వెనకాడినట్లు ఆయన తెలిపారు. రాజకీయాల్లోకి ప్రవేశించడమే విజయం సాధిండమని అన్నారు.
యుద్దం వస్తే ఎదుర్కోవాల్సిందేనని రజనీకాంత్ అన్నారు. దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వస్తానని, రేపే తాను రాజకీయాల్లోకి రావచ్చనని అభిమానులను ఉద్దేశించి అన్నారు. ఇప్పుడు దేవుడు ఆదేశించినట్లు భావించాల్సి ఉంటుంది.
ఆర్కే నగర్‌లో టిటివి దినకరన్ విజయం తర్వాత రజనీకాంత్ తన రాజకీయ రంగ ప్రవేశం గురించి మాట్లాడారు.
అన్నాడియంకె బలహీనపడిన నేపథ్యంలో తమిళ రాజకీయాల్లో శూన్యత ఏర్పడిందని రజనీకాంత్ భావిస్తున్నట్లున్నారు. అందుకే ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించాలనే నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. తాను ఎప్పుడో అభిమానులను కలవాల్సిందని, ఆలస్యం చేశానని ఆయన అన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా