By : Oneindia Telugu Video Team
Published : December 31, 2017, 12:04

చదువు రానివాడు రాజకీయాల్లోకి వచ్చి ఏం చేస్తాడు !

తాను రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నానని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోగా కొత్త పార్టీ స్థాపిస్తానని ప్రకటించిన సూపర్ స్టార్ రజనీకాంత్‌పై బీజేపీ నేత, రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి ఆదివారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ కేవలం రాజకీయాల్లోకి వస్తున్నట్లు మాత్రమే ప్రకటన చేశారని తెలిపారు. కానీ అందుకు సంబంధించి డాక్యుమెంట్లు, వివరాలు ఏవీ లేవని వ్యాఖ్యానించారు. అదే సమయంలో రజనీ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు.

రజనీకాంత్ చదువు రానివాడు అని సుబ్రహ్మణ్యస్వామి విమర్శలు గుప్పించారు. చదువు సంధ్య లేని వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి ఏం చేస్తారని ప్రశ్నించారు. నటులు రాజకీయాల్లోకి రావడం తమిళనాట కొత్త కాదన్నారు. రజనీకాంత్‌కు మీడియా బాగా హైప్ తీసుకు వస్తోందని వ్యాఖ్యానించారు. కానీ తమిళ ప్రజలు చాలా తెలివి గల వారని తెలిపారు. తమిళ రాజకీయాల నుంచి నటులను వెలేసినప్పుడే తమిళనాడు ప్రతిష్ట పెరుగుతుందని సుబ్రహ్మణ్య స్వామి చెప్పారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా