• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : December 31, 2017, 10:34
    Duration : 03:06

    రాజకీయాల్లోకి రజనీకాంత్

    నేను రాజకీయాల్లోకి రావడం ఖాయమని రజనీకాంత్ చెప్పారు. మీడియాతో జాగ్రత్తగా ఉండాలని అభిమానులకు సూచించారు. కాలమే దీనిని నిర్ణయించిందని ఆయన వ్యాఖ్యానించారు. గెలిస్తే విజయం లేదంటే విరమణ అని తేల్చి చెప్పారు. తమిళనాడులో 234 స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పారు. రాజకీయాల్లోకి తాను డబ్బ కోసమే, పేరు కోసమో రావడం లేదని రజనీకాంత్ చెప్పారు. అవన్నీ నాకు ఇప్పటికే ఉన్నాయని చెప్పారు. తాను యుద్ధం చేస్తానని ఓటమి, గెలుపు దేవుడి దయ అని చెప్పారు. తనకు 45 ఏళ్ల వయస్సులో పదవి పైన కోరిక కలగలేదని రజనీకాంత్ అన్నారు. అలాంటిది ఇప్పుడు 65 ఏళ్ల వయస్సులో పుడుతుందా అని ప్రశ్నించారు. తాను డబ్బు కోసం, పేరు కోసం రాజకీయాల్లోకి రావడం లేదని చెప్పారు. అవన్నీ తనకు ఉన్నాయని తెలిపారు.
    లోకసభ ఎన్నికల్లోను పోటీ చేస్తానని రజనీకాంత్ చెప్పారు. నేను రాజకీయాల్లోకి వస్తున్నానని, అన్ని స్థానాల్లోను పోటీ చేస్తానని చెప్పారు. తమిళనాట కొన్ని పార్టీలు రాజకీయాలను భ్రష్టు పట్టించాయని మండిపడ్డారు
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా