By : Oneindia Telugu Video Team
Published : November 29, 2020, 01:20
Duration : 02:49
02:49
సన్యాసమా?.. రంగ ప్రవేశమా?: తేలేది రేపే: రజినీకాంత్ కీలక భేటీ: బీజేపీ వైపేనా?
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది తమిళనాడు. ఇప్పుడిప్పుడే అక్కడి రాజకీయం వేడెక్కుతోంది. క్రమంగా ఎన్నికల మూడ్‌లోకి వెళ్తోంది. భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకుడు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అమిత్ షా సరిగ్గా వారం రోజుల కిందట తమిళనాడులో పర్యటించి వెళ్లారు. రెండు రోజుల పాటు అక్కడే మకాం వేశారు. ఈ వారం రోజుల్లో తమిళనాడులో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ పరిణామాల ప్రభావం ఏమిటనేది సోమవారం తేలిపోనుంది. అదే- ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.