By: Oneindia Telugu Video Team
Published : January 23, 2018, 04:03

పవన్ కళ్యాణ్‌పై రామ్ చరణ్, వరుణ్ తేజ్ ఇలా!

Subscribe to Oneindia Telugu

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు నటుడు రామ్ చరణ్ తేజ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. పవన్ సోమవారం తెలంగాణలో తన పర్యటన ప్రారంభించిన విషయం తెలిసిందే. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజన్న గుడి నుంచి పవన్ తన పర్యటన ప్రారంభించారు. కార్యకర్తలు, నేతలు అభిమానులతో భేటీ అవుతున్నారు. మూడు రోజుల పాటు అభిమానులు, నాయకులు, కార్యకర్తలతో భేటీ సమస్యలపై చర్చించనున్నారు. ఇదిలా ఉండగా, పవన్ సోమవారం మాట్లాడుతూ.. తన రాజకీయాలకు చిరంజీవికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.
తన రాజకీయ జీవితానికి కుటుంబ సభ్యుల మద్దతు లేదని కూడా పవన్ కళ్యాణ్ తెలిపారు. పవన్ ప్రకటించిన కాసేపటికే బాబాయికి చెర్రీ శుభాకాంక్షలు తెలిపారు. ఫేస్‌బుక్ వేదికగా చెర్రీ మద్దతు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ యాత్ర విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. నేను ఓ భారతీయుడిని, నా జన్మభూమిని రక్షించుకొనే బాధ్యత నాపై ఉంది.' అని కామెంట్ పెట్టి, తన బాబాయి పవన్ చేపట్టిన ఈ యాత్ర విజయవంతం కావాలని కోరుకుంటున్నానని చెర్రీ పేర్కొన్నారు. 'బాబాయ్ మీకు అంతా శుభం జరగాలని కోరుకుంటున్నా. జై జనసేన' అని పవన్ ఫోటో పెట్టి పోస్ట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా