By: Oneindia Telugu Video Team
Published : December 27, 2017, 11:10

రాష్ట్రపతిని ఆకట్టుకున్న AP టెక్నాలజీ ..రియల్ టైమ్ గవర్నెన్స్

Subscribe to Oneindia Telugu


రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ నేడు అమ‌రావ‌తికి పర్యటనకు రానున్న విష‌యం తెలిసిందే. ఈ పర్యటనలో రాష్ట్రపతి ఒక అంశాన్ని పరిశీలించేందుకు అత్యధికంగా అరగంట సమయం వెచ్చిస్తున్నారు. రాష్ట్రపతి అంత ప్రాధాన్యం ఇస్తున్న ఆ అంశం ఏమిటంటే ఆర్టీజిఎస్...రియల్ టైమ్ గవర్నెన్స్...మెరుగైన పరిపాలన కోసం ఎపి ప్రభుత్వం అమలు చేయనున్న రియల్ టైమ్ గవర్నెన్స్ విధానం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. దీని గురించి తెలుసుకొని రాష్ట్రపతి సైతం ముగ్థులయ్యారట. అందుకే నేటి అమరావతి పర్యటనలో ఈ ఆర్టిజిఎస్ గురించి తెలుసుకునేందుకు రాష్ట్రపతి అత్యధిక సమయం వెచ్చించనున్నారు. దీంతో రాష్ట్రపతి ఆర్టిజిఎస్ లైవ్ వీక్షణకు ఎపి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.

రాష్ట్రపతి కోవింద్ ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం మెరుగైన పరిపాలన కోసం సాంకేతిక వినియోగంతో తాము చేసిన ప్ర‌యోగాన్ని ప్ర‌ద‌ర్శించ‌నుంది. ఆసియాలోనే అతిపెద్ద పొడ‌వైన 66 అడుగుల హై క్వాలీటి వీడియో స్క్రీన్ పై ఒకేసారి రాష్ట్రంలోని వంద‌ల గ్రామాల్లో ఏర్పాటు చేసిన సిసి కెమెరాల ద్వారా అక్కడి తాజా పరిస్థితిని ప్ర‌త్య‌క్ష ప్రసారం ద్వారా వీక్షించే విధానాన్ని(రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్‌) ఏపీ ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్ర‌ప‌తికి చూపించబోతోంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా