By: Oneindia Telugu Video Team
Published : July 21, 2017, 06:03

అబ్బా... రవి శాస్త్రీ ఆపు... మరీ ఇంత భజనా?

Subscribe to Oneindia Telugu

ఇంతకుముందు టీమ్ ఇండియా డైరెక్టర్ గా ఉన్న సమయంలో రవిశాస్త్రి కెప్టెన్ కోహ్లిని ఎంతగా మోసేవాడో తెలిసిందే. కుంబ్లేతో తేడా వచ్చింది కూడా ఇక్కడే. కుంబ్లే వెళ్లిపోయాక కోహ్లి కూడా రవిశాస్త్రే కోచ్ కావాలని కోరుకున్నాడు. రవిశాస్త్రికి సచిన్-గంగూలీ-లక్ష్మణ్ కమిటీ పచ్చజెండా ఊపడానికి అది కూడా ఓ కారణం. దీన్ని బట్టి రవిశాస్త్రి కోచ్ కావడంలో కోహ్లి.. సచిన్ లది కీలక పాత్ర అని చెప్పొచ్చు.అందుకే రవిశాస్త్రి కోచ్ కావడం ఆలస్యం.. ఏ మొహమాటం లేకుండా వీరి భజన మొదలుపెట్టేశాడు. కోచ్ గా తనను ప్రకటించిన మరుసటి రోజే కోహ్లిని ఆకాశానికెత్తేశాడు. అసలైన కోహ్లి ఏంటో వచ్చే ఐదు పదేళ్లలో చూస్తారంటూ.. అతనో అద్భుతమైన ఆటగాడని.. కెప్టెన్ అని మోసేశాడు. తాజాగా సచిన్ మీద తన భక్తిని చాటుకునే ప్రయత్నం చేశాడు

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా