By: Oneindia Telugu Video Team
Published : June 27, 2017, 06:32

రవితేజ తమ్ముడి విషయం లో తప్పు చేసారా ?

Subscribe to Oneindia Telugu

టాలీవుడ్ స్టార్ రవితేజ సోదరుడు భరత్ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. భరత్ మరణం తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు అందరినీ విస్మయానికి గురి చేశాయి. భరత్‌ను చూడటానికి రవితేజ, కుటుంబ సభ్యులు ఎవరూ రాలేదు. విదేశాల్లో ఉన్న భరత్ భార్య కూడా చివరి చూపుకు రాలేదని సమాచారం.యాక్సిడెంట్ స్పాట్ నుండి భరత్ భౌతిక కాయాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి... అటు నుండి అటే స్మశానానికి తీసుకెళ్లి ఖననం చేశారు. ఒక అనాధ శవానికి కంటే దారుణం గా ప్రవర్తించిన తీరు అందరిని కంటతడి పెట్టించింది. రవితేజ మరో సోదరుడు రఘు మాత్రమే అంత్యక్రియల్లో పాల్గొన్నారు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా