By: Oneindia Telugu Video Team
Published : August 23, 2017, 04:03

సెప్టెంబర్‌లో రూ.200 నోటు..! :RBI

Subscribe to Oneindia Telugu

కరెన్సీ నోట్లపై అక్రమదందాను అడ్డుకొనేందుకు ఆర్‌బిఐ చర్యలను తీసుకొంటోంది. నకిలీ నోట్లు రాకుండా అడ్డుకొనేందుకుగాను కొత్త కొత్త ప్రయోగాలకు రిజర్వ్‌బ్యాంక్ శ్రీకారం చుడుతోంది. తాజాగా రూ. 200 కొత్త నోటును ప్రవేశపెట్టాలని ఆర్‌బిఐ నిర్ణయించింది. ఈ నెలాఖరు లేదా సెప్టెంబర్ మొదట్లో ఈ నోట్లు అందుబాటులోకి వస్తాయని ఆర్‌బిఐ ప్రకటించింది. రూ100, రూ.500 మధ్య ఎలాంటి డినామినేషన్ లేకపోవడంతో కొత్తగా తీసుకొస్తున్న రూ.200 నోట్లు విపరీతమైన డిమాండ్ ఉంటుందని భావించిన ఆర్బీఐ అందుకు తగ్గట్టుగానే కసరత్తు చేస్తోంది.. ఇందులో భాగంగా రూ.200 కొత్త డినామినేషన్ నోట్లను రూ.50 కోట్ల మేర ముద్రించి... ఒకేసారి అందుబాటులోకి తీసుకురానుంది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా