RCB ఆల్‌రౌండర్‌కు బంపరాఫర్! హార్దిక్ స్టానంలో జట్టులోకి
Published : September 27, 2022, 04:10
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) స్పిన్ ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ లక్కీ చాన్స్ కొట్టేసాడు. వర్క్‌లోడ్ నేపథ్యంలో సౌతాఫ్రికా సిరీస్‌కు దూరమైన పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా స్థానంలో టీమిండియా పిలుపును అందుకున్నాడు. అయితే షాబాజ్ అహ్మద్ ఎంపికను బీసీసీఐ దృవీకరించాల్సి ఉంది. మరోవైపు వెన్ను గాయంతో బాధపడుతున్న దీపక్ హుడా, కరోనా నుంచి కోలుకోని మహమ్మద్ షమీ ఈ సిరీస్‌కు దూరమయ్యారు. షమీ స్థానంలో ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ఎంపికైన మహమ్మద్ షమీ.. సౌతాఫ్రికాతో సిరీస్‌కు కూడా కొనసాగనుండగా.. దీపక్ హుడా స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఆడనున్నాడు. ఈ మేరకు ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ ఓ కథనాన్ని ప్రచురించింది. షాబాజ్ అహ్మద్, శ్రేయస్ అయ్యర్‌లను జట్టులోకి తీసుకురావాలని సెలెక్షన్ కమిటీ నిర్ణయించినట్లు ఓ బీసీసీఐ అధికారి పేర్కొన్నాడని తెలిపింది.