By : Oneindia Telugu Video Team
Published : July 27, 2017, 12:19

జియో ఫ్రీ ఫోన్లపై షాకింగ్ న్యూస్

కర్లో దునియా ముట్టీ మే అంటూ రిలయన్స్ పోన్లు కొద్ది సంవత్సరాల క్రితం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. గత సంవత్సరం ప్రవేశ పెట్టిన జియో దెబ్బకు మొబైల్ డేటా వాడకంలో 150వ స్థానంలో ఉన్న భారత్ ఏకంగా నెం.1 స్థానానికి ఎగబాకింది. అదే తరహాలో కొద్ది రోజుల క్రితం జియో ఫోన్లను ఫ్రీగా అందించనున్నామని ముకేష్ అంబానీ సంచలన ప్రకటన చేశారు. ఆ ప్రకటనతో భారత టెలికం రంగంలో కలకలం రేపారు. రూ. 1500 డిపాజిట్ చేసి రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్ సొంతం చేసుకుంటే మూడేళ్ల తరువాత ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని ప్రకటించారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ ఫ్రీ ఫోన్ల విషయంలో రిలయన్స్ తాజాగా ఓ మెలిక పెట్టింది. రూ. 1500 ఫోన్ పొందిన వినియోగదారులు మూడేళ్ల పాటు ప్రతి నెలా రీచార్జ్ చేసుకుంటేనే పూర్తి మొత్తాన్ని మూడేళ్ల తరువాత వెనక్కు చెల్లిస్తారట. ఒకవేళ మధ్యలో రీచార్జ్ చేసుకోకుంటే పూర్తి మొత్తం ఇవ్వబోమని రిలయన్స్ అధికారులు స్పష్టం చేసినట్టు హెచ్ ఎస్బీసీ వెల్లడించింది. రిలయన్స్ సంస్థ సమావేశం వివరాలను హెచ్ ఎస్బీసీ తాజగా ఓ రిపోర్టులో ప్రచురించింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా