By: Oneindia Telugu Video Team
Published : October 25, 2017, 06:28

ప్రముఖ సింగర్ క‌న్నుమూత !

Subscribe to Oneindia Telugu

ప్రముఖ క్లాసికల్ సింగర్ 88 సంవ‌త్సారాల గిరిజా దేవి గుండెపోటుతో క‌న్నుమూశారు.. గ‌త రాత్రి గుండెపోటు సమస్య తలెత్తడంతో కోల్ క‌తాలోని బీఎం బిర్లా హార్ట్ రీసెర్చ్ సెంటర్‌కు ఆమెను తరలించారు. ఆసుపత్రికి తీసుకు వచ్చినప్పుడే ఆమె ఆరోగ్య పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉంది, సీసీయూలో చేర్చి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించారు. అయితే మంగ‌ళ‌వారం రాత్రి 8.45 గంటలకు తుదిశ్వాస విడిచారు. గిరిజాదేవి మృతికి ప్రధాని మోడి ఇంకా కొంతమంది ప్రముకులు సంతాపం తెలిపారు.
భారత క్లాసికల్ సంగీతానికి ఆమె చేసిన సేవలు మరపురానివని కొంతమంది గుర్తు చేసుకున్నారు. ఒక సంగీత దిగ్గజాన్ని దేశం కోల్పోయిందని మరికొంతమంది తమ సంతాపాన్ని తెలిపారు.
ఇక గిరిజా దేవి గారి అవార్డు లను పరిశీలిస్తే (1972) లో పద్మశ్రీ పురస్కారం (1989) లో పద్మభూషణ్ (2016) లో పద్మవిభూషణ్ (1977) లో సంగీత నాటక అకాడమీ అవార్డు (2010) లో సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ (2012) లో మహా సంగీత్ సమ్మాన్ అవార్డు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా