By : Oneindia Telugu Video Team
Published : August 24, 2017, 05:27

ఉప్పుకు కూడా బిల్లు వేసిన రెస్టారెంట్!

ఏదైనా హోటల్‌కి వెళ్లి ఆహారం తింటే దానికి బిల్లు కడతారు. కొంటే వాటర్ బాటిల్‌కు కడతారు... కానీ, ఆహారంలో వేసుకునే చెంచాడు ఉప్పుకు కూడా బిల్లు కట్టడం ఎక్కడైనా చూశారా? ఇక్కడ మాత్రం ఓ వినియోగదారుడికి అది తప్పలేదు. ఓ హోటల్ నిర్వాకంతో వినియోగదారుడు ఆశ్చర్యానికి గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన ఓ వ్యక్తి సోమాజిగూడలో నూతనంగా ప్రారంభించిన ఓ రెస్టారెంట్‌కు కుటుంబసమేతంగా డిన్నర్‌కు వెళ్లాడు. భోజనం తర్వాత సోడాలోకి కొంచెం ఉప్పు కావాలని అడిగాడు. దీంతో ఉప్పు అందించారు హోటల్ సిబ్బంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా