By: Oneindia Telugu Video Team
Published : November 01, 2017, 02:08

సీతక్క ట్విస్ట్: రేవంత్ సతీమణి ప్లాన్

Subscribe to Oneindia Telugu

ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు మాజీ ఎమ్మెల్యే సీతక్క టిడిపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడంలో రేవంత్‌రెడ్డి సతీమణి కీలకపాత్ర పోషించారనే ప్రచారం సాగుతోంది.సీతక్క టిడిపిలోనే కొనసాగుతారనే అందరూ భావించారు. కానీ,, అనుహ్యంగా సీతక్క రేవంత్‌తో పాటే కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే టిఆర్ఎస్‌ నేతలు సీతక్కను సంప్రదించిన మీదట టిడిపిలోనే కొనసాగుతారని ప్రకటించారు. దరిమలా రేవంత్‌రెడ్డి చక్రం తిప్పడంతో సీతక్క అనుహ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు చెబుతున్నారు.రేవంత్‌రెడ్డితో పాటు కీలకమైన నేతలు టిడిపిని వీడారు. అయితే పార్టీతోనే కొనసాగుతామని ప్రకటిస్తూ వచ్చిన సీతక్క అనుహ్యంగా ఢిల్లీకి వెళ్ళారు. టిడిపికి రాజీనామా చేసి రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ములుగు మాజీ ఎమ్మెల్యే సీతక్క టిడిపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం వెనుక రేవంత్‌రెడ్డి సతీమణి పాత్ర ఉందనే ప్రచారం సాగుతోంది. టిడిపిలో చోటుచేసుకొన్న పరిణామాల నేపథ్యంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు చర్చించారని సమాచారం.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా