• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : December 31, 2017, 04:54
    Duration : 02:39

    కెసిఆర్ vs రేవంత్ రెడ్డి @ గొర్రెల పెంపకం

    కులవృత్తులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొందన్నారు కెసిఆర్. చేతివృత్తిదారులకు బడ్జెట్ లో కేటాయింపులు చేసినట్టు చెప్పారు.బడ్జెట్ కేటాయింపులు చేశాం. గొర్రెల పెంపకం 35 సబ్సిడీతో గొర్రెల కాపరుల మెంబర్ షిప్ సాగుతోంది. 5 వేల కోట్లు ఖర్చుచేస్తున్నాం.సేంద్రీయ ఎరువుల అవసరం తీరుతోంది. మాంసం ఎగుమతి చేసే అవకాశాలున్నాయి.చేపల పెంపకానికి అవసరమైన పెట్టుబడిని ప్రభుత్వమే తీసుకొంటోంది. నవీన క్షౌరశాలల ఏర్పాటుకు లక్ష, రజకులకు పరికరాలు, కల్లుగీత వృత్తిని పెంచేందుకు ఈత, గీత చెట్లు పెంచుతున్నట్టు కెసిఆర్ చెప్పారు. ప్రత్యామ్యాయవర్గాల కోసం మారాలని భావిస్తే ప్రభుత్వం చర్యలు తీసుకొంటోందని ఆయన హామీ ఇచ్చారు. గొర్రెల పంపిణీ కోసం ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున గొర్రెలను కొనుగోలు చేస్తుండటంతో.. ఇక్కడి గొర్రెలను పక్క రాష్ట్రాలకు తరలించి, తిరిగి వాటినే తీసుకొచ్చి ఇక్కడ పంపిణీ చేస్తున్నారు. తద్వారా ఎక్కువ ధరకు గొర్రెల్ని కొనుగోలు చేసినట్లు చూపించి ప్రభుత్వం నుంచి ఎక్కువ డబ్బు లాగుతున్నారు. అందులో నుంచి దళారులు, పశువైద్యులకు భారీగానే ముడుతోంది. నిజామాబాద్‌ జిల్లాలో థర్డ్‌ పార్టీ ద్వారా నిఘా పెట్టడంతో అవకతవకలు బట్టబయలై ఏకంగా పశు సంవర్థక శాఖ జేడీనే విధుల నుంచి తప్పించాల్సి వచ్చింది.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా