By: Oneindia Telugu Video Team
Published : October 26, 2017, 02:10

టిడిఎల్పీ సమావేశాన్ని రద్దు చేసుకుని, కంప్యూటర్, ఫైళ్ళను తీసుకెళ్ళిన రేవంత్

Subscribe to Oneindia Telugu

టిడిపి తెలంగాణ శాసనససభపక్ష నేత రేవంత్‌రెడ్డి వెనక్కు తగ్గారు. శాసనసభపక్ష సమావేశం నిర్వహించడాన్ని విరమించుకొన్నారు. మరోవైపు టిడిఎల్పీ కార్యాలయంలోని కంప్యూటర్‌ను ఫైళ్ళను రేవంత్‌రెడ్డి తీసుకెళ్ళారు. రేవంత్‌‌ను ఎమ్మెల్యేగా మాత్రమే ఉంటారని ఎల్. రమణ ప్రకటించిన నేపథ్యంలో రేవంత్‌రెడ్డి తన ఫైళ్ళను తీసుకెళ్లారు. అదే సమయంలో అసెంబ్లీలో టిడిఎల్పీకి కేటాయించిన గదిని తీసుకొనేందుకు అసెంబ్లీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ టిడిపి శాసనసభపక్ష సమావేశాన్ని నిర్వహించి తీరుతామని ప్రకటించిన రేవంత్‌రెడ్డి కాస్త వెనక్కు గ్గారు. పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వినతి మేరకు రేవంత్‌రెడ్డి టిడిఎల్పీ సమావేశాన్ని రద్దు చేసుకొన్నారు.
కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే వార్తలు వెలువడిన నేపథ్యంలో రేవంత్‌రెడ్డి టిడిఎల్పీ సమావేశం నిర్వహించకుండా టిడిపి నాయకత్వం చర్యలు తీసుకొంది. రేవంత్‌రెడ్డిని పార్టీలోని అన్ని పదవుల నుండి తప్పించాలని ఆ పార్టీ రాష్ట్ర అద్యక్షుడు ఎల్. రమణ చంద్రబాబునాయుడును కోరారు. చంద్రబాబు సూచన మేరకే రేవంత్‌రెడ్డిని టిడిఎల్పీ సమావేశం నిర్వహించకూడదని ఎల్. రమణ ఆదేశాలు జారీ చేశారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా