By: Oneindia Telugu Video Team
Published : October 31, 2017, 04:53

అమిత్‌షా వ్యూహనికి రేవంత్‌రెడ్డి చెక్

Subscribe to Oneindia Telugu

రేవంత్‌రెడ్డి టిడిపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం బిజెపికి పెద్ద దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణలో బిజెపి అధికారంలోకి వచ్చేందుకు చేస్తున్న ప్లాన్‌ను రేవంత్‌ రూపంలో దెబ్బకొట్టిందని కమలనాధులు కలవరపడుతున్నారు. రేవంత్ ఎపిసోడ్ కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం కలిగేలా ఉందని ఆ పార్టీ నేతలు అభిప్రాయంతో ఉన్నారు.రేవంత్ అమిత్‌షా వ్యూహనికి చెక్ పెట్టారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
2019 ఎన్నికల్లో టిడిపితో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీచేయాలని బిజెపి నిర్ణయం తీసుకొంది. తెలంగాణ పర్యటన సమయంలో ఈ విషయాన్ని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తేల్చి చెప్పేశారు. 2019 ఎన్నికల నాటికి ఏపీలో టిడిపితో పొత్తు ఉంటుందని చెప్పారు. అయితే 2019 ఎన్నికల విషయంలో పొత్తుపై మాత్రం తేల్చి చెప్పలేదు.తెలంగాణలో బిజెపి వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలకనేతలతో బిజెపి నేతలు కొంతకాలంగా సంప్రదింపులు జరిపారని ప్రచారం సాగింది. కొందరు తెలంగాణ నేతలు కూడ తమకు బిజెపి నేతల నుండి ఫోన్లు వచ్చినట్టు అంతర్గత సంభాషణల్లో కూడ ప్రస్తావించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా