By : Oneindia Telugu Video Team
Published : October 27, 2017, 10:09

టిడిపికి గుడ్‌బై! క్లైమాక్స్‌కు రేవంత్ : వాట్ నెక్స్ట్ ?

తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డి ఎపిసోడ్ క్లైమాక్స్‌కు చేరుకుంది. శుక్రవారం లేదా ఒకటి రెండు రోజుల్లో ఆయన టిడిపికి రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఏపీ సీఎం, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం హైదరాబాద్ రానున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబును కలవాలని ఆయన చూస్తున్నారు.
ఇవాళో రేపో టిడిపికి గుడ్ బై చెప్పే యోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారు. చంద్రబాబు నాయుడును కలిసిన అనంతరం రాజీనామా చేసి వెళ్లిపోవాలని రేవంత్ భావిస్తున్నారు. ఇందుకోసం చంద్రబాబు అపాయింటుమెంట్ కూడా కోరారని తెలుస్తోంది.రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో చంద్రబాబు అపాయింటుమెంట్ ఇస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. చంద్రబాబు అపాయింటుమెంట్ ఇస్తే సైలెంట్‌గా రాజీనామా చేయనున్నారు. లేదంటే మీడియా సమావేశం పెట్టి రాజీనామా చేయాలనేది రేవంత్ రెడ్డి యోచన.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా