By: Oneindia Telugu Video Team
Published : October 27, 2017, 06:26

నోరు విప్పని రేవంత్, మోత్కుపల్లికి షాక్, రేపు కీలక మీటింగ్

Subscribe to Oneindia Telugu

నోరు విప్పని రేవంత్, మోత్కుపల్లికి షాక్, రేపు కీలక మీటింగ్
టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వ్యవహరంలో తెలంగాణ పార్టీ నేతలతో ఏర్పాటు చేసిన సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. అక్టోబర్ 28వ, తేదిన పార్టీ నేతలతో అమరావతిలో చంద్రబాబునాయుడు సమావేశంకానున్నారు. రేవంత్‌రెడ్డి చంద్రబాబుతో ఏకాంతంగా సమావేశమయ్యారు. మరోవైపు రేవంత్‌పై ఫిర్యాదు చేసేందుకు మోత్కుపల్లి నర్సింహ్ములు, అరవింద్‌కుమార్‌గౌడ్‌ చేసిన ప్రయత్నాలను చంద్రబాబు నిలువరించారు.

టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే వార్తల నేపథ్యంలో పార్టీ పదవుల నుండి రేవంత్‌రెడ్డిని తొలగించారు.రేవంత్‌రెడ్డి ఎపిసోడ్ నేపథ్యంలో పార్టీ నేతలతో చంద్రబాబునాయుడు శుక్రవారం నాడు హైద్రాబాద్‌ లేక్‌వ్యూ గెస్ట్‌హౌజ్‌లో సమావేశమయ్యారు.
అక్టోబర్ 28న, అమరావతిలో రేవంత్‌రెడ్డి ఎపిసోడ్‌పై టిడిపి ముఖ్య నేతల సమావేశం సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రేవంత్‌రెడ్డి ఎపిసోడ్‌పై చర్చించనున్నారు.రేవంత్‌రెడ్డి విషయమై రేపటి సమావేశం లో చంద్రబాబునాయుడు కీలకమైన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందంటున్నారు పార్టీ నేతలు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా