By : Oneindia Telugu Video Team
Published : November 03, 2017, 12:14

కేసీఆర్చంద్రబాబుల మధ్య రేవంత్ రెడ్డి : రాజకీయాల్లో ఏం చేస్తామో చెప్పకూడదు

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుల మధ్య గురువారం.. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి ఇష్యూ చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ మాతృమూర్తి విజయలక్ష్మి ఇటీవల కన్నుమూశారు. ఆమె మృతి చెంది 13 రోజులు అయిన సందర్భంగా శుభస్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మూడు రాష్ట్రాల సీఎంలు వచ్చారు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులతో పాటు చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కూడా హైదరాబాదులోని రాజ్ భవన్‌కు వచ్చారు.
రాజ్ భవన్‌లో శుభ స్వీకార కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు, కేసీఆర్‌ల మధ్య తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాల పైన చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.
అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి గురించి చర్చ జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే, శాసన సభ సమావేశాలపై కూడా చర్చించుకున్నారట.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా