By: Oneindia Telugu Video Team
Published : January 29, 2018, 11:01

బుద్ధిలేనోడా : ఏకేసిన రేవంత్

Subscribe to Oneindia Telugu

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంపీ బాల్క సుమన్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యుత్‌ కొనుగోళ్ల విషయంలో జరుగుతున్న కుంభకోణాలు తాను ప్రశ్నిస్తే టీఆర్‌ఎస్‌ ఎంపీ బాల్క సుమన్‌ మాత్రం వివరణ ఇవ్వకుండా తిట్లదండకం మొదలుపెట్టారని అన్నారు. మతితప్పినప్పుడు శృతితప్పిన మాటలు ఎలా ఉంటాయో బాల్క సుమన్‌ మాటలు చూస్తే తెలిసిపోతుందని రేవంత్ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తప్పుచేశారని, ఆ కారణంగానే ప్రభుత్వ అధికారులు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని స్వయంగా బాల్క సుమనే చెప్పినందుకు తాను అభినందిస్తున్నానని అన్నారు. రేవంత్‌రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘బాల్క సుమన్ నన్ను రవ్వంత అన్నాడు. టీఆర్‌ఎస్‌ పార్టీ అవినీతి కొంపను తగులబెట్టేందుకు ఆ రవ్వే చాలు. ఒక్క నిప్పురవ్వే టీఆర్‌ఎస్‌ పార్టీ కొంపను కాలుస్తుంది. తెలంగాణలో 24గంటల విద్యుత్‌ తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదే. 2008లో జీవో 53 ద్వారా 8, 9శాతం విద్యుత్‌ కేటాయింపులు మాత్రమే జరిగాయని బాల్క సుమన్‌ అంటున్నారు. మతి తప్పినప్పుడు శృతిలేని మాటలు ఇలాగే ఉంటాయి. 2008లో రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్‌ పార్టీనే' అని రేవంత్ చెప్పారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా