By : Oneindia Telugu Video Team
Published : April 29, 2017, 04:32

TDP లోకి TRS నేతలు కెసిఆర్ కు లేఖ రాసిన రేవంత్

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. రాష్ట్రంలో రైతులు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నారనడానికి ఖమ్మం మార్కెట్ యార్డు ఘటనే నిదర్శనమన్నారు. రైతుల ఆవేదన కట్టలు తెంచుకోవడంతోనే ఈ ఘటన జరిగిందన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదలిచిన ఉచిత ఎరువులను ఈ ఖరీఫ్ నుంచే ఇవ్వాలని ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే బడ్జెట్ కేటాయింపులు లేవని సాకులు చెప్పకుండా ఆదివారం జరిగే అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్ సవరణలు ప్రతిపాదించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇందుకు తాము మద్దతు తెలిపుతామని స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలోని 55 లక్షల రైతుల వివరాలు 10రోజుల్లోగా సేకరించాలని రేవంత్‌రెడ్డి కోరారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా