By: Oneindia Telugu Video Team
Published : November 01, 2017, 02:54

TRS అంచనాలు రివర్స్: ఎదురులేని రేవంత్

Subscribe to Oneindia Telugu

కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్‌తో పాటు ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ వద్దకు వెళ్లిన వారిలో ఉమ్మడి పాలమూరు జిల్లా నేతలు ఒకరిద్దరే ఉన్నారు
ఈ నెలలో రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారని, ఆ సమయంలో మిగతా సభ్యులు కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు ఉన్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది.ఇప్పటికే టీఆర్ఎస్ అంచనాలు అంతా తారుమారు అవుతున్నాయి. రేవంత్ చేరిక వరకు కొడంగల్లో కాంగ్రెస్ పార్టీకి ఇంచార్జి లేదా చెప్పుకోదగ్గ నాయకుడు లేరు. ఇప్పుడు రేవంత్ అది భర్తీ చేశారు. మరోవైపు సీతక్క వంటి నాయకులు కొందరు టీఆర్ఎస్ వైపు వెళ్తారనుకుంటే అనూహ్యంగా కాంగ్రెస్‌లో చేరారు.
ఈ నేపథ్యంలో పాలమూరు జిల్లాలో టీఆర్ఎస్, టీడీపీ ముఖ్య నేతలు రేవంత్ వెంట వెళ్లకుండా తమ తమ కార్యకర్తలను కాపాడుకోవడంపై ఇతరులు దృష్టి సారించారు. ఈ మేరకు నియోజకవర్గంలో మంగళవారం టీడీపీ, టీఆర్ఎస్ ముఖ్య నేతలు పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా