By: Oneindia Telugu Video Team
Published : November 08, 2017, 02:39

Revanth Reddy : ఓ వైపు రేవంత్, మరో వైపు విజయశాంతి ప్రచారం

Subscribe to Oneindia Telugu

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి త్వరలో పాదయాత్ర చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. చేవెళ్ల నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభం కావొచ్చుననే ప్రచారం సాగుతోంది.
చేవెళ్లలో రేవంత్‌కు మంచి ఫాలోయింగ్ ఉందని, వారంతా ఇక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభించాలని కోరుతున్నారని తెలుస్తోంది. మరోవైపు, రేవంత్ మంగళవారం మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ నేత సర్వే సత్యనారాయణను కలిశారు.
సర్వే సత్యనారాయణ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌ మహేంద్ర హిల్స్‌లోని ఆయన నివాసం వద్ద మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్‌ నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో రేవంత్ పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం ఆ పార్టీ నాయకుడి హోదాలో ఏ అధికార కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఆయన సీనియర్ నేతలను కలుస్తున్నారు. అందరిని కలిసి, అధిష్టానం నుంచి తనకు పదవి వచ్చిన తర్వాత ఆయన కాంగ్రెస్ నాయకుడిగా జనాల్లోకి వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై శాసన సభలో, బయట విరుచుకుపడుతోంది. రేవంత్ కూడా తోడైతే మరింత బలంగా ఉంటుందని భావిస్తున్నారు. కానీ ఆయన మాత్రం కాంగ్రెస్‌లోని సీనియర్ల మద్దతు కూడగట్టుకోవడం పైనే దృష్టి సారించారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా