By : Oneindia Telugu Video Team
Published : April 21, 2018, 06:34

వర్మ కి వ్యతిరేఖం అవ్వనున్న టాలీవుడ్..


వర్మను ఇష్టపడేవారు కూడా ఇప్పుడు అతన్ని వ్యతిరేకిస్తున్నారు. అందుకు కారణం కేవలం పవన్ తల్లిపై వర్మ చేయించిన అనుచిత వ్యాఖ్యలు. ఆయన ఆ కామెంట్స్ చేయించకపోయి ఉంటె బాగుండేది అన్నది చాలా మంది అభిప్రాయం. ప్రస్తుతం వర్మకు నిరసనగా టాలీవుడ్ మొత్తం ఏకమై వర్మపై వేటు వేసే ఆలోచనలో ఉన్నారు. త్వరలో నాగార్జున వర్మపై ఒక కామెంట్ చేయ్యబోతున్నట్లు సమాచారం.
తెలుగు పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు, దర్శకులు, నటీనటులంతా పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలపడం విశేషం. వర్మపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న నేపద్యంలో అఖిల్ తో వర్మ సినిమా ఉంటుందా అనే ఆలోచనలు వస్తున్నాయి. వర్మ అఖిల్ తో సినిమా చేస్తే... వర్మను సపోర్ట్ చేయ్యనివారు అఖిల్ ను తప్పకుండా సపోర్ట్ చెయ్యరు.
అఖిల్ తో ఓ అద్భుతమైన సినిమా చేస్తానని వర్మ ఆమధ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. నాగార్జున కూడా అఖిల్ తో వర్మ సినిమా ఆపెయ్యలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో నాగార్జున ఈ సినిమా గురించి స్పష్టమైన నిర్ణయాన్ని మీడియాకు చెప్పే అవకాశం ఉన్నట్లు నాగ్ కంపొండ్ నుండి వస్తోన్న వార్తా.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా