By : Oneindia Telugu Video Team
Published : December 24, 2017, 10:24

తాత్కాలికంగా ఓట్ల లెక్కింపు నిలిపివేత, మళ్ళీ ప్రారంభం !

ఆర్కేనగర్‌ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు తాత్కాలికంగా నిలిచిపోయింది. లెక్కింపు కేంద్రం వద్ద అన్నాడీఎంకే, దినకరన్‌ వర్గం ఏజెంట్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో గందరగోళం నెలకొనడంతో అధికారులు ఓట్ల లెక్కింపు నిలిపివేశారు.19 రౌండ్ల లో ఓట్ల లెక్కింపు జరగనుండగా ఇప్పటివరకూ రౌండ్లు పూర్తయ్యేసరికి శశికళ వర్గం అభ్యర్థి దినకరన్‌ 2వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలిరౌండ్‌లో దినకరన్‌కు 5,339 ఓట్లు రాగా, అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదన్‌కు 2,738 ఓట్లు, డీఎంకే అభ్యర్థి మరుదు గణేశ్‌ 1,182 ఓట్లు సాధించి మూడోస్థానంలో కొనసాగుతున్నారు. కాగా ఈ నెల 21న ఉప ఎన్నిక ఓటింగ్‌ పూర్తికాగా... మొత్తం 1.77 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 59 మంది అభ్యర్థులు ఈ ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే మధుసూదన్‌, మరుదుగణేష్‌, టీటీవీ దినకరన్‌ల మధ్య ప్రధాన పోటీ నెలకొంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా