By : Oneindia Telugu Video Team
Published : December 24, 2017, 10:07

ఆర్కేనగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు

తమిళనాడులోని ఆర్కేనగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది. ఏడాది ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఎవరు గెలిచారనేది కాసేపట్లో తేలిపోనుంది. జయలలిత మృతి నేపథ్యంలో ఆర్కే నగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. ఓసారి వాయిదా పడింది. ఏడాది తర్వాత ఎన్నికలు జరిగాయి. అన్నాడీఎంకేలోని పరిణామాల నేపథ్యంలో ఫలితాల కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అధికార ప్రతిపక్షాలతోపాటు స్వతంత్ర అభ్యర్థి టీటీవీ దినకరన్‌కు సెమీ ఫైనల్‌ లాంటి ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారా అన్న ఆసక్తి దేశ వ్యాప్తంగా నెలకొంది. . ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎవరికి వారు తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ... ఫలానా వారు గెలుస్తారని ముందస్తు సర్వేలు చెబుతున్నప్పటికీ... ఆర్కేనగర్‌ ఓటర్ల నాడి ఏంటో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

19 రౌండ్ల లో ఓట్ల లెక్కింపు జరగనుండగా ఇప్పటివరకూ రౌండ్లు పూర్తయ్యేసరికి శశికళ వర్గం అభ్యర్థి దినకరన్‌ 2వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలిరౌండ్‌లో దినకరన్‌కు 5,339 ఓట్లు రాగా, అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదన్‌కు 2,738 ఓట్లు, డీఎంకే అభ్యర్థి మరుదు గణేశ్‌ 1,182 ఓట్లు సాధించి మూడోస్థానంలో కొనసాగుతున్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా