By: Oneindia Telugu Video Team
Published : December 24, 2017, 11:33

6వేల ఓట్ల మెజార్టీతో టీటీవీ దినకరన్‌

Subscribe to Oneindia Telugu

ఆర్కేనగర్‌ ఉపఎన్నికల్లో శశికళ వర్గం అభ్యర్థి టీటీవీ దినకరన్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండు రౌండ్లు పూర్తయ్యే సరికి ఆయన అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదన్‌పై 6వేల ఓట్ల మెజార్టీతో కొనసాగుతున్నారు. రెండు రౌండ్లు పూర్తయ్యేసరికి దినకరన్‌కు 10,421 ఓట్లు రాగా, అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదన్‌కు 4,521 ఓట్లు, డీఎంకే అభ్యర్థికి 2,383 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం దినకరన్‌ 5,900 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 19 రౌండ్ల లో ఓట్ల లెక్కింపు జరగనుండగా ఇప్పటివరకూ రౌండ్లు పూర్తయ్యేసరికి శశికళ వర్గం అభ్యర్థి దినకరన్‌ 2వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలిరౌండ్‌లో దినకరన్‌కు 5,339 ఓట్లు రాగా, అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదన్‌కు 2,738 ఓట్లు, డీఎంకే అభ్యర్థి మరుదు గణేశ్‌ 1,182 ఓట్లు సాధించి మూడోస్థానంలో కొనసాగుతున్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా